కథువా రేప్ కేసులో విస్మయపరిచే కొత్త కోణం.. కుమారుడి దుర్మార్గం బయటపడకూడదనే బాలిక హత్య
- బాలికను చంపిన కారణం వివరించిన ప్రధాన నిందితుడు
- ముస్లింలను ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టేందుకే బాలిక కిడ్నాప్
- బాలికపై నిందితుడి కుమారుడు, మేనల్లుడు అత్యాచారం
ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టరాదని ఆదేశించింది. ఈ కేసు విచారణను జమ్మూకశ్మీర్ కోర్టుల్లో చేయవద్దని, చండీగఢ్ కు బదిలీ చేయాలని, సీబీఐకి అప్పగించాలని బాధితురాలి తండ్రి కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలోనే ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.