కర్ణాటక ఎన్నికల్లో పవన్ సపోర్ట్ ఆ పార్టీకే.. త్వరలోనే ప్రచారం!
- ఉత్తర కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రచారం చేయనున్న పవన్
- కనీసం 18 స్థానాలు గెలుచుకోవాలని కుమారస్వామి లక్ష్యం
- స్టార్ క్యాంపెయినర్లుగా జాగ్వార్ హీరో నిఖిల్, పూజాగాంధీ
తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలతోపాటు ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇక్కడ నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో పవన్‌తో ప్రచారం చేయించడం ద్వారా వారి ఓట్లను కొల్లగొట్టాలనేది కుమారస్వామి ఆలోచన. ఇక్కడ కనీసం 18 స్థానాలైనా గెలవాలని జేడీఎస్ పట్టుదలగా ఉంది. జేడీఎస్ తరపున ఇప్పటికే హీరోయిన్ పూజాగాంధీ, జాగ్వార్ హీరో నిఖిల్‌లు ప్రచారం చేయనున్నట్టు ప్రకటించారు.