పరాయి మహిళతో కానిస్టేబుల్ రాసలీలలు... పట్టుకుని ఉతికారేసిన భార్య!
- 2006లో ప్రేమ వివాహం చేసుకున్న రమేష్
- ఆపై 2011లో కానిస్టేబుల్ ఉద్యోగం
- భార్యను నిర్లక్ష్యం చేసి మరో యువతితో సంబంధం
- పోలీసు కేసు నమోదు
ఆపై 2011లో ఆయనకు కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు పోలీసు స్టేషన్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యా బిడ్డలను నిర్లక్ష్యం చేసిన రమేష్, చేర్యాలలో మరో యువతిని చేరదీశాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని నడుపుతూ ఇంటికి రావడం మానేశాడు. అసలు విషయాన్ని ఆరా తీసిన మమత, చేర్యాలకు వచ్చి ఇద్దరూ కలిసున్న వేళ వారి బాగోతాన్ని బయటపెట్టింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఆరోపిస్తూ, సదరు యువతిని, రమేష్ నూ చెప్పుతో వాయించింది. ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆక్కడికి వచ్చి అందరినీ స్టేషన్ కు తరలించారు. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.