వచ్చే నెలలో ఫ్లిప్ కార్ట్, అమేజాన్ మెగా సమ్మర్ సేల్
- స్టాక్ ను సిద్ధం చేస్తున్న సంస్థలు
- తేదీలపై ఇంకా వెలువడని ప్రకటన
- ఫోన్లు, టీవీలు, వస్త్రాలపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, నో కాస్ట్ ఈఎంఐ
స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లు, వస్త్రాలు, హోమ్ డెకరేషన్, రోజువారీ వినియోగ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు సమాాచారం. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు నోకాస్ట్ ఈఎంఐను ఆఫర్ చేయనున్నట్టు ఓ ఉద్యోగి తెలిపారు. వచ్చే నెల సేల్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ అధికార ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. అయితే, వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో, అమేజాన్ ఇండియా గ్రేట్ ఇండియా సేల్ పేరుతో ఏటా మే నెలలో భారీ విక్రయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాయి.