Mahesh Babu: సినిమా సూపర్.. ఫుల్ ఎంజాయ్ చేశా: 'భరత్ అనే నేను'పై కేటీఆర్ ప్రశంసలు

  • కేటీఆర్ కోసం 'భరత్ అనే నేను' స్పెషల్ షో
  • సినిమా సూపర్ అన్న మంత్రి
  • మహేష్, శివలతో ఉన్న ఫొటోలు షేర్

'భరత్ అనే నేను' సినిమా అద్భుతంగా ఉందని, తాను చాలా ఎంజాయ్ చేశానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సినిమా యూనిట్ కేటీఆర్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మహేష్ బాబు, కొరటాల శివలతో కలిసి కేటీఆర్ సినిమా చూశారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేశారు. తాము మాట్లాడుతున్నప్పటి ఫొటోలను అప్ లోడ్ చేశారు. ప్రజా జీవితం ఎలా ఉంటుందన్న అంశంపై హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివలతో చర్చలో పాల్గొన్నానని మంత్రి తెలిపారు. మరోవైపు ఈ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. భారీ వసూళ్లను రాబడుతోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.

More Telugu News