ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేసేందుకే దొంగతనాలు: 'తనిష్క్'లో చోరీ చేసిన గజదొంగ
- ప్రజాసేవ చేయాలన్నదే లక్ష్యం
- ఎంపీగా గెలిచి ప్రజల తలరాతలు మారుస్తా
- విచారణలో అంతర్రాష్ట్ర గజదొంగ
వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం, తన స్నేహితులు బడుగు శ్రావణమూర్తి, పేరంపల్లి రాజేష్, బోరుగడ్డ ప్రవీణ్ కుమార్, నలబోలు కోమల్ నవీన్, బీ కిరణ్ కుమార్ లతో కలసి ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లో నేరాలకు పాల్పడేవారు. గత నెల 17న ఓ ఇన్నోవాను అద్దెకు తీసుకుని, హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చి, ఆపై గుంటూరు జిల్లా ఈపూరు వద్ద, డ్రైవర్ పై పెప్పర్ స్ప్రేను కొట్టి, వాహనంతో పరారైన ఈ బ్యాచ్, దాన్ని విజయవాడలో విక్రయిస్తూ పట్టుబడ్డారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచామని వినుకొండ పోలీసు అధికారులు తెలిపారు.