అభిశంసన నోటీసుని తిరస్కరించిన వెంకయ్యపై ఆగ్రహం.. సుప్రీంకోర్టుకు వెళతామన్న కాంగ్రెస్
- జస్టిస్ దీపక్ మిశ్రపై అభిశంసన తీర్మానం తిరస్కరణ
- ఉపరాష్ట్రపతి నిర్ణయం సరైంది కాదన్న కాంగ్రెస్
- చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని మండిపాటు
- ఇది విచారణ చేపట్టి తీసుకోవాల్సిన నిర్ణయమని వ్యాఖ్య
అభిశంసన నోటీసుపై విచారణ చేపట్టి ఆ తరువాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ముందే తీసుకున్నారని అన్నారు. దీన్ని తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని వద్దనుకునేవారికి, కాపాడుకునేవారికి మధ్య యుద్ధాన్ని ప్రేరేపించేలా వెంకయ్య నాయుడి నిర్ణయం ఉందని అన్నారు.