సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అమ్మాయిలకు ధైర్యం ఇస్తున్న సాయిపల్లవి
- మహేశ్ సినిమా చూడనున్న రజనీకాంత్
- హిట్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్
* మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం రికార్డ్ కలెక్షన్లతో సూపర్ హిట్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో చెన్నైలో ఈ చిత్రాన్ని వీక్షించనున్నట్టు సమాచారం. దీనిని తమిళంలో రీమేక్ చేయడానికి పలువురు స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్న సమయంలో రజనీ దీనిని వీక్షించనుండడం విశేషం.
* ఆమధ్య వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హీరో విజయ్ దేవరకొండ దీనిపై చెబుతూ, 'దర్శకుడు సందీప్ వంగాతో సీక్వెల్ గురించి చర్చించడం జరిగింది. నలభై ఏళ్లు వచ్చిన తర్వాత అర్జున్ రెడ్డి ఎలా మారాడు? అన్న పాయింట్ తో దీనికి సీక్వెల్ చేయాలనుకుంటున్నాం' అని చెప్పాడు.