టీటీడీ బోర్డులో తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబుకి ఎమ్మెల్యే అనిత లేఖ!
- నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
- నా నియామకాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు
- రాష్ట్ర సర్కారుకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు
- అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను-అనిత
టీటీడీ పాలకవర్గంలో తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలని అనిత అందులో పేర్కొన్నారు. తన నియామకాన్ని కొందరు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, ఈ విషయం వల్ల రాష్ట్ర సర్కారుకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు.