ఇవే సంఘటనలు పునరావృతమైతే నేనంటే ఏమిటో చేతల్లో చూపిస్తా : ఏవీ సుబ్బారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అతని ప్రత్యర్థులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ‘ఏబీఎన్’ తో ఆయన మాట్లాడుతూ, ఎవరైతే దాడి చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు విలేకరులు ఉన్నారని, సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారాలు ఉన్నాయని అన్నారు. తనపై దాడి చేసిన వారు ఒక వాహనంలో వచ్చారని, మంత్రి అఖిలప్రియుల వర్గీయులే తనపై దాడి చేశారని డీఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.

గత ముప్పైఐదేళ్లుగా భూమా కుటుంబానికి అండగా ఉన్న తనపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేయడంతో తాను షాక్ కు గురయ్యానని అన్నారు. తాను, అఖిలప్రియ ఒకే పార్టీలో ఉన్నాము కనుక, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాను మౌనం వహించాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన, ఈ సంఘటనను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇవే సంఘటనలు పునరావృతమైతే ఏవీ సుబ్బారెడ్డి అంటే ఏమిటో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తాని హెచ్చరించారు.  
Go Back to Shorts
Telugudesam
av subbareddy

More Telugu News