రౌడీషీటర్ కళ్లల్లో కారం చల్లి హత్య చేసిన దుండగులు!

  • పరికి బస్తీలో జరిగిన సంఘటన
  • రౌడీషీటర్ ను కత్తులతో విచక్షణా రహితంగా పొడిచిన వైనం
  • నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓ రౌడీషీటర్ కళ్లల్లో కారం చల్లి అతన్ని హతమార్చిన సంఘటన సికింద్రాబాద్ లోని రెతిఫైట్ బస్సు స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ హత్య గురించి గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. పరికి బస్తీలో దుండగులు తమ వెంట తెచ్చుకున్న కారంను రౌడీషీటర్ ఫరీద్ కళ్లల్లో చల్లారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. కత్తి పోట్లతో ప్రాణాలు కోల్పోయి పడి ఉన్న ఫరీద్ ను గమనించిన పాదచారులు ఈ మేరకు పోలీసులకు సమాచారమిచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఇద్దరు మహిళలతో పాటు మరో నలుగురు ఫరీద్ పై దాడి చేసినట్టు స్థానికులు చెప్పారని అన్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కాగా, రౌడీషీటర్ ఫరీద్ పై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదై ఉన్నాయి.
Go Back to Shorts
secunderabad
rowdy sheeter farid

More Telugu News