Pawan Kalyan: సార్! నియంత్రించుకోలేకపోతున్నా... కన్నీళ్లు ఆగడం లేదు: పవన్ కు బాబీ ట్వీట్

  • గడిచిన 48 గంట‌లు నా జీవితంలో అత్యంత కఠినమైనవి
  • మీరు ఆపడం వల్ల ఆగుతున్నాం
  • మీరు ఆడవారికి ఎంత రక్షణగా ఉంటారో మీతో కలిసి పని చేసిన నాకు తెలుసు
తనను తాను నియంత్రించుకోలేకపోతున్నానని, కన్నీళ్లు ఆగడం లేదని యువ దర్శకుడు బాబీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కల్యాణ్ తల్లిపై చేసిన వ్యాఖ్యల వివాదంపై చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, `స‌ర్‌! గ‌డిచిన‌ 48 గంట‌లు నా జీవితంలో అత్యంత క‌ఠిన‌మైన క్ష‌ణాలు. మీరు బాధ‌ప‌డుతున్నార‌ని తెలిసినా, మీరు ఆప‌డం వ‌ల్ల‌ మేము స్పందించ‌లేదు.

కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న‌ది చూస్తున్న త‌ర్వాత న‌న్ను నేను నియంత్రించుకోలేక‌పోతున్నా. నా ఎమోషన్స్, క‌న్నీళ్లు ఆగ‌డం లేదు. మీతో కలిసి పని చేసినందువల్ల ఆడ‌వారికి మీరు ఎంత‌ ర‌క్ష‌ణ‌గా ఉంటారో నాకు తెలుసు. ఇప్పుడు మేం మీకంటే ఎక్కువ బాధ‌ప‌డుతున్నాం. ఎందుకంటే మీరు మీ త‌ల్లికి మాత్ర‌మే బిడ్డ కాదు. ఈ గడ్డ బిడ్డ. మీకు నా సెల్యూట్‌. జైహింద్‌` అని పేర్కొన్నాడు. అన్నట్టు బాబి గతంలో పవన్ కల్యాణ్ తో `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్‌` సినిమా చేసిన సంగతి విదితమే. 
Pawan Kalyan
bobby
director
sardar gabbar singh

More Telugu News