Pawan Kalyan: ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ తల్లి, పలువురు నటులు, సినీ ప్రముఖులు.. కాసేపట్లో మెగాస్టార్!

  • ఫిలిం ఛాంబర్ కు వచ్చిన పవన్ కల్యాణ్ తల్లి
  • ఒక్కొక్కరుగా తరలి వస్తున్న సినీ ప్రముఖులు
  • సమావేశానంతరం మీడియాతో మాట్లాడనున్న చిరంజీవి, పవన్
తనపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి దిగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తన సోదరుడు నాగబాబుతో కలసి హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయవాదులతో ఆయన చర్చిస్తున్నారు. ఈ సంరద్భంగా పవన్ కల్యాణ్ తల్లి కూడా ఛాంబర్ కు వచ్చారు. అక్కడకు ఇప్పటికే పలువురు నటులు, సినీ ప్రముఖులు చేరుకున్నారు.

ఇప్పటిదాకా ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చినవారిలో అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వీవీ వినాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీరాజా, హేమ, మారుతి, మెహర్ రమేష్, బన్నీ వాసు తదితరులు వచ్చారు. ఒక్కొక్కరుగా ఇతరులు కూడా వస్తున్నారు. కాసేపట్లో చిరంజీవి ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకోబోతున్నారు.

ఫిల్మ్ ఛాంబర్ కు చిరంజీవి చేరుకున్న తర్వాత... మెగా ఫ్యామిలీ కార్యాచరణ తెలిసే అవకాశం ఉంది. తాజా పరిణామాలపై వారు ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమావేశం అనంతరం చిరంజీవి, పవన్ లు మీడియాతో మాట్లాడవచ్చని తెలుస్తోంది. మరోవైపు, మెగా ఫ్యాన్స్ కూడా ఫిల్మ్ ఛాంబర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 
Pawan Kalyan
Chiranjeevi

More Telugu News