RGV: పవన్ బాధపడటం బాధ కలిగించింది.. వర్మ పని నచ్చలేదు!: పూరీ జగన్నాథ్‌

  • నాకు పవన్ కల్యాణ్ జీవితాన్నిచ్చారు
  • ప్రాణం ఉన్నంత వరకూ పవన్‌ కల్యాణ్‌ని సపోర్ట్‌ చేస్తాను
  • రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన పని నాకు నచ్చలేదు
'నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కల్యాణ్ గారు ఈ రోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది. అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన పని నాకు నచ్చలేదు. ప్రాణం ఉన్నంత వరకూ నేను పవన్‌ కల్యాణ్‌ని సపోర్ట్‌ చేస్తాను' అంటూ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ట్వీట్ చేశారు.

ఇటీవల పవన్‌ కల్యాణ్‌పై యువనటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకు దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మే కారణమని తెలియడంతో సినీ ప్రముఖులందరూ ఆయనపై మండిపడుతున్నారు. వర్మ చుట్టూ ఓ నీచ వర్గం ఉంటుందని నిర్మాత అల్లు అరవింద్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో, రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడిగా, సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్‌ కూడా తాను పవన్‌ కల్యాణ్‌కే మద్దతిస్తున్నట్లు ట్వీట్ చేయడం గమనార్హం.
RGV
Puri Jagannadh
Pawan Kalyan

More Telugu News