పల్లెటూరి పిల్లగా కల్యాణి ప్రియదర్శన్
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ కి ఛాన్స్
- 1980 నేపథ్యంలో కొనసాగే కథ
ప్రస్తుతం శర్వానంద్ .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 1980 నేపథ్యంలో కొనసాగుతుందట. ఇందులో మాఫియా డాన్ గా శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఇక కల్యాణి ప్రియదర్శన్ పల్లెటూరి పిల్లగా కనిపిస్తుందని చెబుతున్నారు. మరి ఈ పాత్రలో ఈ అమ్మాయి ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.