నాకు గెలవాలన్న లక్ష్యమే తప్ప.. ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఉండదు!: సైనా నెహ్వాల్
- 11 రోజులు నిరంతరాయంగా ఆడాము
- టీమ్ ఈవెంట్ లో గెలిచిన స్వర్ణం సంతోషాన్నిచ్చింది
- సింధుపై గెలవాలన్న లక్ష్యంతోనే బరిలో దిగాను
ప్రత్యర్థి ఆటతీరును బట్టి తన ఆటతీరును మలచుకుంటానని చెప్పింది. బహుశా ప్రణాళిక లేకుండా కోర్టులో దిగే క్రీడాకారిణిని తాను ఒక్కదాన్నేమోనని పేర్కొంది. ఇతర మ్యాచ్ ల లాగే సింధుతో మ్యాచ్ కు కూడా సన్నద్ధమయ్యానని తెలిపింది. సింధుపై గెలవాలన్న లక్ష్యంతోనే ఆడానని చెప్పింది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే తన లక్ష్యమని సైనా స్పష్టం చేసింది. సింధు కూడా అలాగే ఆలోచిస్తుందనుకుంటానని నవ్వేసింది. ఈ మ్యాచ్ కు ముందు గోపీ సార్ 'మీరు దేశం కోసం ఆడుతున్నారన్న విషయం గుర్తుంచుకోండి. మీ ఆటను చూసి దేశం గర్వించాల'ని చెప్పారని, ఆ మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సైనా తెలిపింది.