Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  అటు స్టార్ హీరోలతో చేస్తూనే, మధ్యలో అప్పుడప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్న అందాలభామ నయనతార తాజాగా మరో హీరోయిన్ ప్రధాన చిత్రం చేయడానికి అంగీకరించింది. 'కొట్టాయం కుర్బాన' పేరిట మలయాళంలో రూపొందే ఈ చిత్రంలో నయనతార సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తుందట.
* జపాన్ లో కూడా 'బాహుబలి 2' సినిమా తన సత్తా చాటింది. ఇటీవలే అక్కడ నూరు రోజుల ప్రదర్శనను కూడా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ త్వరలో అక్కడికి వెళుతోంది. ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లకు వెళ్లి అక్కడి ప్రేక్షకులతో దర్శకుడు రాజమౌళి ఇంటరాక్ట్ అవుతారట.
*  స్టార్ హీరో సినిమా రిలీజవుతుంటే విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోలు వేయడం మామూలే. అయితే ఈ 20న విడుదలవుతున్న 'భరత్ అనే నేను' చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి ప్రీమియర్ షోలను వేయడం లేదని సమాచారం. అమెరికాలో మాత్రం సుమారు రెండు వేల ప్రీమియర్ షోలను ఏర్పాటు చేస్తున్నారు.  
Go Back to Shorts
Nayanatara
Rajamouli
Mahesh Babu

More Telugu News