Salman Khan: సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

షార్ట్స్‌లో చూడండి
సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు మన్నించింది. విదేశీ పర్యటనకు జోధ్ పూర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఈ రోజు అనుమతి మంజూరు చేసింది. కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడి బెయిల్ పై ఉన్న సల్మాన్ ఖాన్, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్న షరతు ఉంది. దీంతో ఆయన కోర్టు అనుమతి కోరుతూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కెనడా, నేపాల్, అమెరికా తదితర దేశాల్లో వచ్చే నెల 25 నుంచి జూలై 10 వరకు సల్మాన్ ఖాన్ పర్యటించేందుకు మార్గం సుగమం అయింది.
Go Back to Shorts
Salman Khan
bail

More Telugu News