పక్కపక్కనే ఉన్నా... పలకరించుకోని నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు

  • సింగపూర్ పర్యటనలో ఉన్న గడ్కరీ, చంద్రబాబు
  • హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌కు హాజరు
  • సింగపూర్‌లో పలువురితో చంద్రబాబు చర్చలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని పలువురు ప్రతినిధులతో చర్చించారు. ఆ దేశ మంత్రి ఈశ్వరన్ తో కూడా భేటీ అయి ఏపీలో పెట్టుబడులపై మాట్లాడారు.

కాగా, హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ, చంద్రబాబు పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయట్లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.                                                                             
Go Back to Shorts
nitin gadkari
Chandrababu
Andhra Pradesh

More Telugu News