Chiranjeevi: సుకుమార్ దర్శకత్వంలో చిరూ .. ముఖ్యమైన పాత్రలో రవితేజ?

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల సుకుమార్ మాట్లాడుతూ .. తన దగ్గర రెండు మూడు మంచి కథలు ఉన్నాయనీ, అవి ఎవరికి సెట్ అవుతాయనేది చూడాలని అన్నారు. అందులో ఒక కథను ఆయన చిరంజీవికి వినిపించాడనే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'రంగస్థలం' .. అది సాధించిన విజయం చూసిన చిరంజీవి, సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిని చూపడం వల్లనే కథ వినిపించాడట.

చిరూ ఇలా తీరిక చేసుకుని మరీ కథ వినడం వెనుక చరణ్ వున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకి గాను రవితేజ అయితే బాగుంటుందని భావించి సుకుమార్ సంప్రదించడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం చిరూ చేస్తోన్న 'సైరా' సినిమా పూర్తయిన తరువాతనే సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
Chiranjeevi
sukumar

More Telugu News