థియేటర్లో రెస్పాన్స్ చూశాను .. నా కడుపు నిండిపోయింది: నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థియేటర్లో రెస్పాన్స్ చూశాను .. నా కడుపు నిండిపోయింది: నాని

  • థియేటర్లలో 'కృష్ణార్జున యుద్ధం' సందడి
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన నాని
  • చాలా హ్యాపీ అంటున్న దర్శకుడు       
నాని తాజా చిత్రంగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ దగ్గర సందడి ఒక రేంజ్ లో కనిపిస్తోంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ .. "వేసవి సెలవుల్లో అందరినీ అలరించే సినిమా ఇది .. ఈ వీకెండ్ లో తప్పకుండా చూడవలసిన సినిమా" అన్నాడు.

"థియేటర్స్ లో అంతా నవ్వుతూ .. కేరింతలు కొడుతూ ఈ సినిమా చూస్తుంటే నాకు కడుపు నిండిపోయినట్టుగా అనిపించింది. పైరసీని ఎంకరేజ్ చేయకుండా అంతా కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి" అన్నాడు. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ .. "కృష్ణార్జున యుద్ధం చూసిన తరువాత అంతా ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. అన్ని ఏరియాలనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కృష్ణ పాత్రకి దక్కుతోన్న ఆదరణ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది" అని చెప్పుకొచ్చాడు.     
nani
anupama

More Telugu News