Karnataka: బీజేపీపై చంద్రబాబు దుష్ప్రచారం: రెబల్ స్టార్ కృష్ణంరాజు

షార్ట్స్‌లో చూడండి
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంటే, ఆయన్ను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని రెబల్ స్టార్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడంతో పాటు, మరోసారి అధికారంలోకి రావాలన్న కోరికతోనే కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు.

ఏపీకి బీజేపీ అన్యాయం చేయలేదని, ప్యాకేజీలో భాగంగా ఇస్తామని చెప్పిన వాటిల్లో ఎన్నో జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని కృష్ణంరాజు అన్నారు. ఏవో ఆలస్యం అయ్యాయని నిరసనలు చేయడం, విమర్శించడం భావ్యం కాదని, అందుకు చంద్రబాబు ప్రభుత్వం కూడా కారణం కావచ్చని అన్నారు. ప్రభుత్వం నుంచి సరైన సమయంలో సరైన నివేదికలు అందక కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అయ్యుండవచ్చని తెలిపారు. సిద్దరామయ్య ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని కర్ణాటకలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, ఇది హాస్యాస్పదం అన్నారు. భ్రష్టాచార పనులను చేస్తూ, అవినీతిలో నంబర్ వన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని నిప్పులు చెరిగారు.
Go Back to Shorts
Karnataka
Krishnamraju
Assembly Elections
Chandrababu

More Telugu News