మోదీ నిరాహారదీక్షపై జగన్ ట్వీట్!
- మీరు ఈ రోజు నిరాహారదీక్ష చేపట్టారు
- ఏపీ ఎంపీలు ఆరు రోజులపాటు దీక్ష చేశారు
- ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి
'నరేంద్ర మోదీగారు... మీరు ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా... 6 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన ఐదుగురు ఏపీ ఎంపీలు ఆసుపత్రిలో ఉన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలను దయచేసి వినండి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి' అంటూ ట్వీట్ చేశారు.