trisha: రజనీ జోడీ కట్టేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోన్న త్రిష
- సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీకాంత్ మూవీ
- దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు
- విలన్ పాత్రలో విజయ్ సేతుపతి
సన్ పిక్చర్స్ వారు రజనీకాంత్ హీరోగా .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. అయితే కథానాయిక పాత్రను దక్కించుకోవడానికి త్రిష గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టుగా సమాచారం.
తమిళంలో రజనీకాంత్ మినహా మిగతా అగ్ర హీరోలందరి సరసన త్రిష నటించింది. ఇన్నేళ్ల తన కెరియర్లో ఇంతవరకూ రజనీకాంత్ సరసన ఛాన్స్ లభించకపోవడం పట్ల ఆమె అసంతృప్తితో వుంది. అందువలన ఆయన సరసన ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం ఆమె కొంతకాలంగా ఎదురుచూస్తోంది. కార్తీక్ సుబ్బరాజు సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్నాడు. ఆయనతో త్రిషకి మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన ద్వారా ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోందట. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.