చంద్రబాబు మరీ హీనంగా వ్యవహరిస్తున్నారు: బీజేపీ ఎంపీ జీవీఎల్ నిప్పులు
- లెనిన్ సెంటర్ లో ఉపవాస దీక్షకు అనుమతివ్వలేదు
- మూడు రోజుల క్రితమే అడిగాము
- చంద్రబాబుది పక్షపాత ధోరణి
- విజయవాడ ధర్నా చౌక్ లో ప్రారంభమైన బీజేపీ దీక్ష
తాము లెనిన్ సెంటర్ లో దీక్షకు అనుమతి అడిగామని, అనుమతిస్తారన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకుంటుంటే, చివరకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంట్ స్తంభనకు తెలుగుదేశం పార్టీయే కారణమని ఆరోపించిన జీవీఎల్, ఒక్క చర్చ కూడా జరగనీయకుండా చూశారని, అవిశ్వాసంపై చర్చిస్తే, టీడీపీ బండారం బట్టబయలవుతుందని చంద్రబాబు భయపడ్డారని అన్నారు.
తమ ఉపవాస దీక్ష విషయంలో చంద్రబాబు పక్షపాత ధోరణితో వ్యవహరించారని అన్నారు. తామే సర్దుకుని చివరకు ధర్నా చౌక్ లో నిరసనకు నిర్ణయించుకున్నామని తెలిపారు. కాగా, విజయవాడ బీజేపీ నేతల ఉపవాస దీక్ష ధర్నాచౌక్ లో మొదలైంది.