- ఆస్ట్రేలియాలో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్
- స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం వెంకట రాహుల్
- జనసేన పార్టీ ఆయనకు సెల్యూట్ చేస్తోందని పవన్ ట్వీట్
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిప్టింగ్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ రోజు పవన్ ట్వీట్ చేస్తూ... 'రాగాల వెంకట రాహుల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆయనకు జనసేన పార్టీ తరఫున రూ.10 లక్షల చెక్‌ను ప్రోత్సాహకంగా ఇస్తాం. రాహుల్ స్వర్ణ పతకం సాధించి, మన మాతృభూమి భారత్ గర్వపడేలా చేశారు. నీ అత్యద్భుత విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. జనసేన పార్టీ నీకు సెల్యూట్ చేస్తోంది.. జై హింద్' అని పేర్కొన్నారు.