Jagan: మార్నింగ్, ఈవెనింగ్‌ వాక్‌లు చేస్తూ జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: దేవినేని ఉమా

షార్ట్స్‌లో చూడండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మార్నింగ్, ఈవెనింగ్‌ వాక్‌లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే వారం తాము 13 జిల్లాల్లో 116 రోజుల పాటు జల సంరక్షణ ఉద్యమం చేయనున్నట్లు చెప్పారు.

నీరు-చెట్టులోనూ అవినీతి అంటూ వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి తీరు అభ్యంతరకరమని దేవినేని ఉమా మండిపడ్డారు. కొందరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అన్నింటినీ అధిగమించి నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేవరకు నెలకోసారి అక్కడకు వెళ్తానని చెప్పారు. తాము వచ్చే నెలలో సుజల స్రవంతిని జాతికి అంకితం చేయబోతున్నామని చెప్పారు.
Go Back to Shorts
Jagan
devineni uma
Telugudesam

More Telugu News