delhi: ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ సరైనదే : సీఎం కేజ్రీవాల్

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఢిల్లీలోని తుగ్గక్ రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద  ఎంపీలు చేస్తున్న ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ సరైనదేనని, ‘హోదా’ ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్తే టీడీపీ ఎంపీలను అరెస్టు చేశారని, వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం బాధాకరమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని మరోమారు స్పష్టం చేసిన కేజ్రీవాల్, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
Go Back to Shorts
delhi
Telugudesam
kejriwal

More Telugu News