Salman Khan: సినీనటి టబు కాల్చమని చెప్పింది.. 'సల్మాన్ కృష్ణజింకల' కేసులో ప్రత్యక్ష సాక్షి

షార్ట్స్‌లో చూడండి
కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమాన విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒకరు న్యాయస్థానంలో ఓ విషయాన్ని చెప్పారు.

అప్పట్లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్‌ కృష్ణ జింకను వేటాడేటప్పుడు ఆయనతో పాటు ఇతర సినీనటులు ఉన్నారని, వేటాడుతున్నప్పుడు జీపులో పక్కనే ఉన్న టబు కాల్చమని సల్మాన్ ని రెచ్చగొట్టిందని చెప్పారు.

కాగా, ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కి మాత్రమే శిక్ష పడింది. సల్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టులో వేసిన బెయిల్‌ దరఖాస్తు విషయమై సెషన్స్‌ కోర్టు రేపు ఉదయం తీర్పు వెలువరిస్తుంది.
Go Back to Shorts
Salman Khan
tabu

More Telugu News