'ఎన్టీఆర్' మూవీలో బసవతారకంగా దీపికా పదుకొనే?
- బాలకృష్ణ సొంత బ్యానర్లో 'ఎన్టీఆర్'
- మొదలైన నటీనటుల పరిశీలన
- తెరపైకి దీపికా పదుకొనే పేరు
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకం' పాత్రలో విద్యాబాలన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. విద్యాబాలన్ లో కనిపించే నిండుదనం కారణంగా ఈ పాత్రకి ఆమెను ఎంపిక చేయనున్నారనే టాక్ వినిపించింది.కానీ తాజాగా దీపికా పదుకొనే పేరు తెరపైకి వచ్చింది. నటన పరంగా దీపికకు వంకబెట్టవలసిన పనిలేదు. 'శ్రీదేవి' బయోపిక్ దీపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బసవతారకం పాత్ర కోసం దీపికనే దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.