amaravati: ఏపీకి మోదీ ఇచ్చిన హామీల వీడియోలను జాతీయ మీడియాకు ప్రదర్శించి చూపిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల సమయంలో ఏపీకి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ మధ్యలో... అప్పట్లో ఏపీలో మోదీ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి చూపారు. అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, అమరావతిలో అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామని మోదీ చెప్పారని అన్నారు.

మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తరువాత హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని చెబితే అంగీకరించామని చంద్రబాబు అన్నారు. రెండున్నరేళ్లుగా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూశామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల తాను ఓ లేఖ కూడా రాశానని అన్నారు. మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరువల్ల 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
Go Back to Shorts
amaravati
Chandrababu
Special Category Status

More Telugu News