RGV: ‘రంగస్థలం’ సినిమాపై రామ్ గోపాల్‌ వర్మ ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే విడుదలైన ‘రంగస్థలం’ సినిమాకి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ చిత్రం మంచి విజయం అందుకుందని, రామ్‌చరణ్‌ మైండ్‌ బ్లోయింగ్‌, అద్భుతమని ట్వీట్ చేశారు. 'హే సుకుమార్, ఇదిగో నీకు నా మూడు నమస్కారాలు.. మూడు ముద్దులు' అని వర్మ ట్వీట్లో పేర్కొన్నారు.

 కాగా, రామ్ చరణ్, సమంత జంటగా ఆది, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్, అనసూయ ప్రధానపాత్రల్లో దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో చెర్రీ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ సినిమాలో మాస్‌ ‌లుక్‌లో రామ్ చ‌ర‌ణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. 1985లో ‘రంగస్థలం’ అనే గ్రామంలో జరిగిన క‌థ‌గా ఈ సినిమా రూపొందింది.  
Go Back to Shorts
RGV
Ramcharan
sukumar

More Telugu News