Lok Sabha: అర నిమిషంలోనే లోక్ సభ వాయిదా.. రాజ్యసభ రేపటికి వాయిదా!
- పార్లమెంటులో సేమ్ సీన్
- లోక్ సభను అడ్డుకున్న అన్నాడీఎంకే ఎంపీలు
- క్షణాల్లోనే సభను వాయిదా వేసిన స్పీకర్
లోక్ సభలో సేమ్ సీన్ రిపీటయింది. సభ ప్రారంభమైన అర నిమిషంలోనే సభ వాయిదా పడింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలోకి వచ్చిన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు కోసం వారు పట్టుబట్టారు. సంయమనం పాటించాలని స్పీకర్ కోరినప్పటికీ వారు ఆందోళనను ఆపలేదు. దీంతో, సభను మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు, అవిశ్వాసంపై చర్చను చేపట్టాలని టీడీపీ, వైసీపీ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి.
రాజ్యసభలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
రాజ్యసభలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.