Karnataka: కర్ణాటక ప్రభుత్వంతో మంత్రి హరీశ్ రావు జరిపిన చర్చలు సఫలం
కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్ట్ కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకరించింది. ఈ మేరకు హరీశ్ రావుకు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి పాటిల్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా పాటిల్ కు హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. నీటి కొరత కారణంగా ఒక టీఎంసీ నీటిని జూరాలకు విడుదల చేయాలని హరీశ్ రావు కోరడం జరిగింది.