రేపు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు
- ఎస్సీ/ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా నిర్ణయం
- వద్దని వారిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- కోర్టు తీర్పు చట్టం సమర్థతను దెబ్బతీసేలా ఉందని ఆరోపణ
సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా ప్రభుత్వం వేయనుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ చట్టం కింద తక్షణ అరెస్టులు చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు ఇటీవల తన తీర్పులో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద ఏదైనా కేసు నమోదు చేయాలంటే జరిగిన సంఘటనపై డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు తప్పనిసరిగా ఉండాలని, ఎవరైనా ప్రభుత్వాధికారులను అరెస్టు చేయాలంటే ముందస్తు అనుమతి ఉండాలంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును విపక్ష కాంగ్రెస్ సహా దళిత సంఘాలు, ఎన్డీయేలోని పలువురు దళిత ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎస్సీ/ఎస్టీ చట్టం సమర్థతను దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.