Telangana: డిసెంబర్ లో ఎన్నికలొస్తాయి..కాంగ్రెస్ గెలుపు తథ్యం : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

డిసెంబర్ లో ఎన్నికలొస్తాయని, కాంగ్రెస్ గెలుపు తథ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేటి నుంచి 10వ తేదీ వరకు తెలంగాణలో రెండో విడత బస్సు యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో సీఎం, స్పీకర్ వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని, హైకోర్టుకు అసెంబ్లీ ఫుటేజ్ ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఆరోపించారు. కాగ్ నివేదిక ఆధారంగా కోర్టు కెళ్లాలని ఆలోచిస్తున్నామని, తెలంగాణకు సీఎంగా కేసీఆర్ కొనసాగడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించే అర్హత మంత్రి కేటీఆర్ కు లేదని అన్నారు.
Telangana
Congress
Uttam Kumar Reddy

More Telugu News