Chandrababu: చంద్రబాబుతో చర్చలు సంతృప్తి నిచ్చాయి .. టీడీపీలోనే కొనసాగుతా : యలమంచిలి రవి

షార్ట్స్‌లో చూడండి
పార్టీ మారాలనే ఉద్దేశాన్ని విరమించుకుంటున్నట్టు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి చెప్పారు. సీఎం చంద్రబాబుతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి చంద్రబాబును ఆయన కలిశారు. సుమారు గంటసేపు ఈ భేటీ కొనసాగింది. అనంతరం, మీడియాతో రవి మాట్లాడుతూ, పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని, సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. 

 చంద్రబాబుతో జరిపిన చర్చలు తనకు సంతృప్తి నిచ్చిన నేపథ్యంలో పార్టీ మారాలనే ఆలోచనను విరమించుకుంటున్నానని చెప్పారు. కాగా, టీడీపీలో తనకు సముచిత స్థానం కల్పించలేదని భావించిన రవి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రవిని టీడీపీ అధిష్ఠానం బుజ్జగించింది. ఇందులో భాగంగా రవిని చంద్రబాబు వద్దకు కేశినేని నాని తీసుకువెళ్లారు.
Go Back to Shorts
Chandrababu
yalamanchili ravi

More Telugu News