పరిటాల ఇంట మరో పెళ్లి సందడి.. రవి కుమార్తె ఎంగేజ్ మెంట్.. వీడియో చూడండి

  • రవి, సునీతల కుమార్తె స్నేహలత నిశ్చితార్థం
  • వరుడు రవి సోదరి కుమారుడు హర్ష
  • మే 6న వెంకటాపురంలో వివాహం
పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. దివంగత పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల ఏకైక కుమార్తె స్నేహలత వివాహ నిశ్చితార్థం హర్షతో అనంతపురం జిల్లా వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా పరిటాల ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం, వేదమంత్రాల మధ్య స్నేహలత, హర్షలు పూలమాలలు మార్చుకున్నారు.

పరిటాల రవీంద్ర సోదరి వడ్లమూడి శైలజ కుమారుడు హర్ష. మంచి బిజినెస్ మేన్ గా హర్ష గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహలత ఎండీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కాల్వ శ్రీనివాసులుతో పాటు పలువురు నేతలు, అధికారులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వీరి వివాహం మే 6వ తేదీన వెంకటాపురంలో జరగనుంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అప్పుడే ప్రారంభం అయ్యాయి. పరిటాల రవి కోరిక మేరకు వీరి వివాహాన్ని నిర్ణయించినట్టు సమాచారం.
Go Back to Shorts
parital ravi
parital sunitha
paritala sreeram
snehalatha
daughter
engagement

More Telugu News