Chandrababu: కేంద్ర సర్కారుపై నిరసన.. నల్ల బ్యాడ్జీలు ధరించిన ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై నల్ల బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు నల్లబ్యాడ్జీలు ధరించారు. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్‌లో ప‌లు కంపెనీల‌ను ప్రారంభించడానికి వ‌చ్చిన రాష్ట్ర‌ మంత్రులంతా న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి క‌న‌పడ్డారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... విశాఖపట్నం మంచి లాజిస్టిక్‌ హబ్‌ అని, అద్భుతమైన పర్యాటక కేంద్రమని, ఈ ప్రాంతంలో తాము అంతర్జాతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన వారిలో చంద్రబాబుతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారా లోకేశ్, ఎంపీ అవంతి శ్రీనివాస్ ఉన్నారు.
Go Back to Shorts
Chandrababu
Special Category Status
Telugudesam

More Telugu News