లాలూ ప్రసాద్ కుమారుడిని ప్రశంసించిన బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా!
- తేజస్వికి మంచి భవిష్యత్తు ఉంది
- నితీష్ కుమార్ కు పోటీ అవుతాడు
- లాలూను కలవడం చాలా సంతోషంగా ఉంది
రాబోయే ఎన్నికల సమయానికి తేజస్వి మరింత రాటుదేలుతాడని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పోటీ అవుతాడని శతృఘ్నసిన్హా అన్నారు. పట్నా ఆసుపత్రిలో ఉన్న లాలూను కూడా ఆయన కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, చాలా రోజుల తర్వాత లాలూను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు.