రష్యా షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం... 64 మంది సజీవ దహనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యా షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం... 64 మంది సజీవ దహనం

  • పశ్చిమ సైబీరియాలోని కెమెరొవోలోని వింటర్ చెర్రీ షాపింగ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం
  • థియేటర్ లో చెలరేగిన మంటలు
  • క్షణాల్లో నాలుగంతస్తులకు చుట్టుముట్టిన కీలలు
రష్యాలోని ఒక షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 64 మంది సజీవ దహనం కావడంతో అక్కడ విషాదం నెలకొంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... రష్యాలోని పశ్చిమ సైబీరియాలో కెమెరొవోలోని వింటర్‌ చెర్రీ షాపింగ్‌ సెంటర్‌ లో మల్టిప్లెక్స్‌ థియేటర్లు, స్పా, బౌలింగ్‌ వంటి పలు సౌకర్యాలు ఉన్నాయి. రష్యాలో వింటర్ హాలీడేస్ తరువాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో ఈ మాల్ లో సరదాగా గడిపేందుకు భారీ ఎత్తున స్థానికులు చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో షాపింగ్ మాల్ ప్రాంగణం రద్దీగా ఉండగా, ఒక సినిమా థియేటర్‌ నుంచి మంటలు వ్యాపించాయి. ఇవి  క్షణాల్లో షాపింగ్ మాల్ ను చుట్టుముట్టాయి.

 నాలుగు అంతస్తులకు పాకిన మంటల్లో షాపింగ్ చేసేందుకు వచ్చినవారు అందరూ చూస్తుండగానే చిక్కుకుపోయారు. దీంతో రెండు థియేటర్ల పైకప్పులు కూలిపోయాయి. ఈ ఘటనలో సజీవ దహనమైన 64 మంది మృతదేహాలను రెస్క్యూటీమ్ గుర్తించింది. మరో 10 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పలువురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో హెచ్చరించేందుకు ఏర్పాటు చేసిన ఫైర్ అలారమ్స్ పని చేయలేదని, మంటలు చూసిన మాల్ సిబ్బంది వినియోగదారులను బయటకు పంపే ప్రయత్నం కూడా చేయలేదని పలువురు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Russia
vinter shoping mall
64 dead in russia

More Telugu News