టోల్ ప్లాజా ఉద్యోగుల హెచ్చరికలతో కీసర వద్ద తప్పిన పెను ప్రమాదం

  • ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మంటలు
  • గమనించి అలర్ట్ చేసిన ఉద్యోగులు
  • 40 మంది సేఫ్
ఈ ఉదయం కృష్ణా జిల్లా కీసర వద్ద టోల్ ప్లాజా ఉద్యోగులు చేసిన హెచ్చరికలతో పెను ప్రమాదం తప్పింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, టోల్ ప్లాజా నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దాటుతున్న సమయంలో బస్సు టైర్లకు మంటలు అంటుకుని ఉన్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే డ్రైవర్ ను అప్రమత్తం చేయాలని పెట్రోలింగ్ సిబ్బందిని వారు అప్రమత్తం చేయడంతో ప్రయాణిస్తున్న బస్సును వారు అడ్డగించారు. ఈ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ముంబై నుంచి విజయవాడ వస్తుండగా, బస్సును ఆపిన కాసేపటికే రెండు టైర్లు పూర్తిగా దహనమయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Krishna District
Keesara
Bus
Fire Accident

More Telugu News