Telangana: జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజ్ కిశోర్ కు రూ.25 లక్షల చెక్కు అందజేత

షార్ట్స్‌లో చూడండి
కొన్ని రోజులుగా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజ్ కిశోర్ ను మంత్రి పద్మారావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జిమ్నాస్టిక్స్ లో ఆయన అందించిన సేవలకు గాను తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.25 లక్షల చెక్ ను అందజేశారు. పద్మారావు వెంట స్పోర్ట్స్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్ లో భారత్ కు తొలిపతకం అందించిన క్రీడాకారిణి అరుణారెడ్డికి బ్రిజ్ కిశోర్ కోచ్ గా వ్యవహరించారు. ఈ పోటీల్లో అరుణారెడ్డి కాంస్య పతకం సాధించారు.  
Go Back to Shorts
Telangana
coach briz kishore
minister padmarao

More Telugu News