యూత్ ను ఊరిస్తోన్న 'మెహబూబా' రిలీజ్ డేట్
- ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
- యూత్ లో పెరుగుతోన్న ఆసక్తి
- మే 11వ తేదీన భారీస్థాయిలో రిలీజ్
ఈ సినిమా కోసం యూత్ అంతా కూడా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే 11వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. పూరీ తన సొంతబ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసే హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ సినిమా కంటెంట్ లో బలమైన విషయమే ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాతో హీరోగా ఆకాశ్ నిలబడిపోతాడేమో చూడాలి.