కొత్తగా కనిపించిన కల్యాణ్ రామ్ .. మరింత అందంగా అనిపించిన కాజల్!
- ఈ రోజే విడుదలైన 'ఎమ్మెల్యే'
- లుక్ పరంగా కల్యాణ్ రామ్ కి మంచి మార్కులు
- గ్లామర్ తో కట్టిపడేసిన కాజల్
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు .. ఇంతకుముందు సినిమాల్లోకంటే ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడని అంటున్నారు. నటన పరంగా కూడా ఆయన కొత్తదనాన్ని చూపించడానికి ట్రై చేశాడని చెబుతున్నారు. ఇక కాజల్ విషయానికొస్తే .. గతంలో కంటే ఆమె ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనిపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె గ్లామర్ ఈ సినిమా ప్రధానాంశాల్లో ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ .. మంచి కంటెంట్ తో మార్కులు కొట్టేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.