ట్రంప్ చర్యకు చైనా దిమ్మతిరిగే సమాధానం... అమెరికా సరుకులపై భారీ పన్ను
- అమెరికా నుంచి దిగుమతి అయ్యే 128 ఉత్పత్తులపై పన్ను
- కొన్నింటిపై 15 శాతం, కొన్నింటిపై 25 శాతం
- చైనా ఉత్పత్తులపై ట్రంప్ పన్నేయడంతో ప్రతిస్పందన
ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులపై టారిఫ్ విషయంలో చైనా తగ్గింపు విధానాన్ని అనుసరిస్తోంది. పండ్లు, నట్స్, వైన్, తదితర ఉత్పత్తులపై 15 శాతం దిగుమతి పన్ను విధించనున్నట్టు చైనా తెలిపింది. పంది మాంసం, రీసైకిల్ చేసిన అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం పన్ను వేయనుంది. రెండు దశల్లో ఈ చర్యలను అమలు చేయనున్నట్టు చైనా పేర్కొంది. తొలి దశలో 15 శాతం పన్నును అమలు చేస్తామని, వాణిజ్య అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరకపోతే రెండో దశలో 25 శాతం పన్నును ఆచరణలో పెడతామని చైనా తెలిపింది.