అంబేద్కర్ కు అవమానం ట్వీట్ పై హార్డిక్ పాండ్య వివరణ ఇదే!
- అంబేద్కర్ అంటే చాలా గౌరవం
- భారత రాజ్యాంగాన్ని కానీ, ఏదైనా వర్గాన్ని కానీ కించపరచలేదు
- ఫ్యాన్స్ తో మమేకమయ్యేందుకే సోషల్ మీడియాను వాడతాను
భారత రాజ్యంగం గురించి కానీ, దేశంలో ఏ వర్గాన్ని గురించి కానీ కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదని పాండ్య స్పష్టం చేశాడు. సోషల్ మీడియాని ఫ్యాన్స్ తో నేరుగా మమేకమయ్యేందుకు, తనకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు మాత్రమే వినియోగిస్తానని పాండ్య తెలిపాడు. ఈ వివాదంలో కోర్టుకు అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కేవలం తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బ తీసేందుకే ఈ ట్వీట్ చేశారని పాండ్య తెలిపాడు. ఇలాంటి పరిస్థితిని ఇండియాలో ప్రతి సెలబ్రిటీ ఎదుర్కొంటాడని హార్డిక్ పాండ్య తెలిపాడు.