శశికళ కేసులో మరో ట్విస్ట్.. చికిత్స సమయంలో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసిన అపోలో!
- 24 బెడ్‌లున్న ఐసీయూలో జయ ఒక్కరికే చికిత్స
- ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు సీసీ కెమెరాలు కట్
- స్వయంగా వెల్లడించిన ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
జయలలితకు ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను జస్టిస్ అర్ముగస్వామి కమిటీకి అందించినట్టు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. జయ అపస్మారక స్థితిలోనే ఆసుపత్రిలో చేరినట్టు చెప్పిన ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ చేసే సమయం వచ్చిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందినట్టు వివరించారు.