ఎన్నారై అమ్మాయిగా మీ అందరికీ నచ్చుతాను: కాజల్
- 'ఎమ్మెల్యే'లో కథానాయికగా కాజల్
- భారీస్థాయిలో రేపే రిలీజ్
- హిట్ ఖాయమన్న కాజల్
"చాలాకాలం తరువాత కల్యాణ్ రామ్ సరసన చేశాను .. పాత స్నేహితులం మళ్లీ కలుసుకున్నట్టుగా అనిపించింది. నటన పరంగా కల్యాణ్ రామ్ మంచి పరిణతిని సాధించాడు. 'ఎమ్మెల్యే' .. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రం .. ఇది తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి సైన్ చేసినట్టుగా చెప్పుకొచ్చింది.