విక్రేతలకు పిచ్చెక్కిస్తున్న ఫ్లిప్ కార్ట్ కొత్త పాలసీ... డిస్కౌంట్ల భారం నెత్తినేసుకోవాలంటూ సెల్లర్లను కోరుతున్న సంస్థ!
- డిస్కౌంట్ల భారం వదిలించుకునే యత్నం
- 60 శాతం భరించాలని సెల్లర్లను కోరిన సంస్థ
- 40 శాతం తాను భరిస్తానని ప్రతిపాదన
ఈ మేరకు ఇటీవల సెల్లర్లకు ఫ్లిప్ కార్ట్ నుంచి సమాచారం అందింది. నిజానికి ఇంత కాలం ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఎప్పటికప్పుడు తాజా నిధులను సమీకరించడం ద్వారా ప్రచారం, డిస్కౌంట్ల పేరిట మంచినీళ్లలా వాటిని ఖర్చు చేశాయి. దీని ద్వారా అవి అగ్ర స్థాయి కంపెనీలుగా అవతరించాయి. అయినప్పటికీ భారీ తగ్గింపులు లేకుండా విక్రయాలు సాగించలేని పరిస్థితి నెలకొనడంతో ఆ భారాన్ని తగ్గించుకోవడమెలాగన్న దానిపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ‘‘తగ్గింపు మొత్తంలో 60 శాతాన్ని మీరు భరించండి. మిగిలిన 40 శాతాన్ని మేం భరిస్తాం’’ అంటూ ఫ్లిప్ కార్ట్ సెల్లర్లను కోరడం గమనార్హం.